Rajya sabha | 10 రాజ్య‌స‌భ స్థానాల‌కు జులై 24 ఎన్నిక‌లు.. జై శంక‌ర్‌కు మ‌ళ్లీ సీటు ద‌క్కేనా..?

Rajya sabha | గుజ‌రాత్, ప‌శ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ప‌రిధిలోని 10 రాజ్య‌స‌భ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ ప‌ది రాజ్య‌స‌భ స్థానాల‌కు జులై 24న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ప‌శ్చిమ బెంగాల్ నుంచి ఆరు స్థానాల‌కు, గుజ‌రాత్ నుంచి మూడు, గోవా నుంచి ఒక స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ ప‌ది మంది ప‌ద‌వీకాలం జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ముగియ‌నున్నది. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి జులై 6న […]

Rajya sabha | 10 రాజ్య‌స‌భ స్థానాల‌కు జులై 24 ఎన్నిక‌లు.. జై శంక‌ర్‌కు మ‌ళ్లీ సీటు ద‌క్కేనా..?

Rajya sabha | గుజ‌రాత్, ప‌శ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ప‌రిధిలోని 10 రాజ్య‌స‌భ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ ప‌ది రాజ్య‌స‌భ స్థానాల‌కు జులై 24న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ప‌శ్చిమ బెంగాల్ నుంచి ఆరు స్థానాల‌కు, గుజ‌రాత్ నుంచి మూడు, గోవా నుంచి ఒక స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ ప‌ది మంది ప‌ద‌వీకాలం జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ముగియ‌నున్నది.

ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి జులై 6న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. జులై 13వ తేదీ లోపు నామినేష‌న్ల దాఖ‌లుకు గడువు ఇవ్వ‌నున్నారు. 24వ తేదీన ఉద‌యం 10 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అదే రోజు రాత్రి వ‌ర‌కు ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

జై శంక‌ర్‌కు మ‌ళ్లీ సీటు ద‌క్కేనా..?

గుజ‌రాత్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జై శంక‌ర్.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జైశంక‌ర్‌కు మ‌ళ్లీ రాజ్య‌స‌భ సీటు వ‌స్తుందా? రాదా..? అనే విష‌యంపై రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక ఇదే గుజ‌రాత్ నుంచి దినేశ్ జెమ్లాభాయి అవ‌ధాని, లోక‌నంద్‌వాలా జుగ‌ల్ సింగ్ ప‌ద‌వీ కాలం కూడా ముగియ‌నుంది. బెంగాల్ నుంచి డెరెక్ ఓబెరిన్, దోలా సేన్, ప్ర‌దీప్ భ‌ట్టాచార్య‌, సుష్మిత దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖ‌ర్ రే ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. గోవా నుంచి విన‌య్ టెండూల్క‌ర్ ఉన్నారు.