Elephant Climbs Wall| మనిషిలా గోడ దూకిన ఏనుగు..వీడియో వైరల్

ఏనుగులు తెలివైన జంతువులు అన్నది తెలిసిందే. మనుషుల స్థాయిలో ఆలోచించడమే కాదు..తన భారీ శరీరాన్ని సైతం మరిచిపోయి ఒక్కోసారి మనుషులు చేసే పనులు సైతం చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి

Elephant Climbs Wall| మనిషిలా గోడ దూకిన ఏనుగు..వీడియో వైరల్

Elephant Climbs Wall

విధాత: ఏనుగులు తెలివైన జంతువులు అన్నది తెలిసిందే. మనుషుల స్థాయిలో ఆలోచించడమే కాదు..తన భారీ శరీరాన్ని సైతం మరిచిపోయి ఒక్కోసారి మనుషులు చేసే పనులు సైతం చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఒడిశాలోని కియోంఝర్‌లోని గ్రామంలోకి ఒక అడవి ఏనుగు ప్రవేశించి భయాందోళనకు గురిచేసింది. పంటలను ధ్వంసం చేస్తూ ఓ వ్యవసాయ క్షేత్రంలోని గోశాల వద్ధకు చేరింది. గోశాలలో గోవుల కోసం పెట్టిన మేతను తినేందుకు ఆ ఏనుగు ఏకంగా గోశాల గది కిటికి ద్వారం గుండా లోనికి ప్రయత్నించే ప్రయత్నం చేసింది.

“>మనిషిలా గోడ దూకిన ఏనుగు

 

ఏనుగు కిటికి ద్వారంలోని గోడను ఎక్కి లోనికి ప్రవేశించి గోవుల కోసం ఉంచిన మేతను తినేసి తాపీగా వచ్చిన దారినే మళ్లీ గోడను దాటి బయటకు వచ్చింది. ఈ తతంగాన్ని అంతా స్థానికులు వీడియో తీశారు. గోశాల నుంచి బయటకు వచ్చిన తర్వాతా కూడా ఏనుగు పంటలను ధ్వంసానికి పాల్పడింది.

సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అడవి వైపు తరిమికొట్టారు. ఏనుగు గోడను ఎక్కి గోశాలలోకి వెళ్లిన వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో ఆ ఏనుగు ఎంత తెలివైందోనంటూ కామెంట్లు చేస్తుండగా..మరికొందరు మేత కోసం దొంగ పనిచేసినా దొంగ ఏనుగు అని మరికొందరు కామెంట్ చేశారు.