Elgar Parishad । ఎల్గార్ పరిషద్ కేసులో.. గొంజాల్వెజ్, ఫెర్రెయిరాలకు బెయిల్
Elgar Parishad మహారాష్ట్ర విడిచి వెళ్లొద్దన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల లింకు కేసులో సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెర్రెయిరాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. వారు ఐదేళ్లకు పైగా కస్టడీలో ఉన్నారని పేర్కొన్నది. ఇద్దరూ మహారాష్ట్ర విడిచి వెళ్లరాదని, తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించాలని షరతు విధించింది. ఇద్దరు కార్యకర్తలు చెరొక మొబైల్‌ఫోన్ ఉపయోగించవచ్చునని, వారు నివసించే చిరునామాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు తెలియజేయాలని నిర్దేశించింది. తాము బెయిల్ కోసం […]

Elgar Parishad
- మహారాష్ట్ర విడిచి వెళ్లొద్దన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల లింకు కేసులో సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెర్రెయిరాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. వారు ఐదేళ్లకు పైగా కస్టడీలో ఉన్నారని పేర్కొన్నది. ఇద్దరూ మహారాష్ట్ర విడిచి వెళ్లరాదని, తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించాలని షరతు విధించింది.
ఇద్దరు కార్యకర్తలు చెరొక మొబైల్‌ఫోన్ ఉపయోగించవచ్చునని, వారు నివసించే చిరునామాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు తెలియజేయాలని నిర్దేశించింది. తాము బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను బాంబే హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గొంజాల్వెజ్, ఫెర్రెయిరాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు 2017, డిసెంబర్ 31వ తేదీన పుణెలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశానికి సంబంధించినది. ఈ సమావేశానికి మావోయిస్టులు నిధులు అందజేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆ సమావేశంలో చేసిన ఉద్రేకపూరిత ఉపన్యాసాల కారణంగానే ఆ మరుసటి రోజు పుణెలోని కోరేగావ్ భీమా వార్ మెమోరియల్ వద్ద హింస చోటు చేసుకున్నదని పోలీసులు పేర్కొంటున్నారు.