క‌లెక్ట‌రేట్ ఎదుట పెళ్లికాని ప్ర‌సాదుల నిర‌స‌న‌.. ఎందుకంటే..?

Maharashtra | మాకు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌ని, సకాలంలో స్కాల‌ర్‌షిప్‌లు మంజూరు చేయాల‌ని, హాస్ట‌ల్స్‌లో నాణ్య‌మైన భోజ‌నం అందించాల‌ని డిమాండ్ చేస్తూ క‌లెక్ట‌రేట్ల ఎదుట యువ‌త నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు దిగిన ఘ‌ట‌న‌లు చూశాం. కానీ ఈ నిర‌స‌న మాత్రం వింత‌గా ఉంది. తాము వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొర‌క‌డం లేద‌ని పెళ్లి వ‌య‌సు వ‌చ్చిన యువ‌కులు కలెక్ట‌రేట్ ఎదుట బైఠాయించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లాలో బుధ‌వారం వెలుగు చూసింది. […]

క‌లెక్ట‌రేట్ ఎదుట పెళ్లికాని ప్ర‌సాదుల నిర‌స‌న‌.. ఎందుకంటే..?

Maharashtra | మాకు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌ని, సకాలంలో స్కాల‌ర్‌షిప్‌లు మంజూరు చేయాల‌ని, హాస్ట‌ల్స్‌లో నాణ్య‌మైన భోజ‌నం అందించాల‌ని డిమాండ్ చేస్తూ క‌లెక్ట‌రేట్ల ఎదుట యువ‌త నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు దిగిన ఘ‌ట‌న‌లు చూశాం. కానీ ఈ నిర‌స‌న మాత్రం వింత‌గా ఉంది. తాము వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొర‌క‌డం లేద‌ని పెళ్లి వ‌య‌సు వ‌చ్చిన యువ‌కులు కలెక్ట‌రేట్ ఎదుట బైఠాయించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లాలో బుధ‌వారం వెలుగు చూసింది.

సోలాపూర్ జిల్లా ప‌రిధిలోని పెళ్లి కాని యువ‌కులంద‌రూ.. సంప్ర‌దాయ దుస్తుల్లో రెడీ అయ్యారు. ఇక గుర్రాల‌పై ఊరేగుతూ.. జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. క్రాంతి జ్యోతి ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ఆందోళ‌న‌కు పెళ్లికాని ప్ర‌సాదులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ల విష‌యంలో అబ్బాయిల‌కు స‌రిప‌డ అమ్మాయిలు లేర‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదే ప‌రిస్థితి సోలాపూర్ జిల్లాలోనూ నెల‌కొని ఉంద‌న్నారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివి, జీవితంలో స్థిర‌ప‌డిన కూడా జీవిత భాగ‌స్వామి దొర‌క్క ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వాపోయారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగనిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే అని వారు ఆరోపించారు.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌తి 1000 మంది పురుషుల‌కు 889 మంది స్త్రీలు మాత్ర‌మే ఉన్నారు. అదే కేర‌ళ రాష్ట్రంలో చూస్తే ప్ర‌తి 1000 మంది పురుషుల‌కు 1050 మంది మ‌హిళ‌లు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌తి వెయ్యి మంది పురుషుల‌కు 940 మంది స్త్రీలు ఉన్నారు.