Twitter | ట్విట్టర్‌లో.. ఎగిరిపోనున్న బ్లూ బర్డ్
Twitter విధాత: ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చాడు. ఇకపై ట్విట్టర్ లోగోను మార్చ బోతున్నామని వెల్లడించారు. ట్విట్టర్ లోగో అయిన బ్లూ బర్డ్ ను తీసీ వేసి X లోగో త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు మస్క్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక ట్విట్టర్ లోగోకు త్వరలోనే వీడ్కోలు పలుకుతాము అలాగే అన్నీ బ్లూ బర్డ్స్‌కు కూడా అని ట్వీట్ చేశారు. చాలా కాలంగా మస్క్ X జపం చేస్తున్నాడు. ఈ […]

విధాత: ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చాడు. ఇకపై ట్విట్టర్ లోగోను మార్చ బోతున్నామని వెల్లడించారు. ట్విట్టర్ లోగో అయిన బ్లూ బర్డ్ ను తీసీ వేసి X లోగో త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు మస్క్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక ట్విట్టర్ లోగోకు త్వరలోనే వీడ్కోలు పలుకుతాము అలాగే అన్నీ బ్లూ బర్డ్స్‌కు కూడా అని ట్వీట్ చేశారు.
చాలా కాలంగా మస్క్ X జపం చేస్తున్నాడు. ఈ యాప్ చైనా వీ చాట్ “WeChat” అనే యాప్‌ను పోలి ఉంటుంది. ఇది వ్యక్తులను కనెక్ట్ చేయడంతోపాటు ఇందులోనే ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ పేమెంట్స్ వంటి సదుపాయాలు ఉండేలా ఈ సూపర్ యాప్ తయారు కాబోతోందని ఎలాన్ మస్క్ చాలా సార్లు తెలియ జేశాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ X యాప్‌లో ట్విట్టర్‌ను విలీనం చేశాడు. అప్పటి నుంచి ట్విట్టర్ X యాప్‌లోకి రీబ్రాండ్ చేయబడిందని ఇంటర్నెట్‌లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మార్పు ఇంత త్వరగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
ఈ నేపథ్యంలో మస్క్ యాప్ బ్రాండ్ మార్పు విషయంలో తన ప్రణాళికల గురించి ట్వీట్ చేశాడు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని గంటల్లేనే లోగో మారుతోందని వెల్లడించాడు.