T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్ విజేత ఇంగ్లండ్..

T20 World Cup | టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఇంగ్లండ్ నిలిచింది. ఫైన‌ల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగి, కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన ఇంగ్లండ్ జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి. టీ20 వ‌ర‌ల్డ్ కప్ ఇంగ్లండ్ గెల‌వ‌డం ఇది […]

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్ విజేత ఇంగ్లండ్..

T20 World Cup | టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఇంగ్లండ్ నిలిచింది. ఫైన‌ల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగి, కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన ఇంగ్లండ్ జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి. టీ20 వ‌ర‌ల్డ్ కప్ ఇంగ్లండ్ గెల‌వ‌డం ఇది రెండోసారి. 2010లో తొలిసారిగా ఇంగ్లండ్ టీ20 ప్ర‌పంచ క‌ప్‌ను గెలిచిన సంగ‌తి తెలిసిందే.

మొదట బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్యసాధనలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ బ్యాటర్లలో షాన్‌ మసూద్‌ 38, బాబర్‌ అజమ్‌ 32, షాబాద్‌ ఖాన్‌ 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో శ్యామ్‌ కరణ్‌కు 3, రషీద్‌కు 2, జోర్డాన్‌ కు 2 వికెట్లు దక్కాయి.

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో బెన్‌స్టోక్‌ 52 పరుగులు నాటౌట్‌, బట్లర్‌ 26, హ్యారీ బ్రూక్‌ 20 రన్స్‌ చేసి జట్టు విజ‌యానికి కృషి చేశారు. బౌలింగ్‌లో పాక్‌ ఆటగాడ్‌ హారిస్‌ రౌఫ్‌ రెండు వికెట్లు తీశాడు. విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు రూ. 13 కోట్లు, రన్నర్‌ పాక్‌కు రూ. 6.5 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.