Errabelli Dayakar Rao | ఎన్నికల వేళ యువతకు ఎర
Errabelli Dayakar Rao - ఎర్రబెల్లి ట్రస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మేళా - పాలకుర్తిలో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి - జనగామలోనూ ఇదే తరహా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు వస్తున్నాయంటే ఏమైనా చేయడానికి మన నాయకులు సిద్ధమవుతారు. ప్రజాప్రతినిధిగా సాధ్యం కాదంటే తమ కుటుంబ సభ్యుల పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టులు రెడీగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి కార్యక్రమం వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో బీఆర్‌ఎస్, జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పోటీపడి చేపట్టారు. […]

Errabelli Dayakar Rao
– ఎర్రబెల్లి ట్రస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మేళా
– పాలకుర్తిలో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
– జనగామలోనూ ఇదే తరహా
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు వస్తున్నాయంటే ఏమైనా చేయడానికి మన నాయకులు సిద్ధమవుతారు. ప్రజాప్రతినిధిగా సాధ్యం కాదంటే తమ కుటుంబ సభ్యుల పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టులు రెడీగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి కార్యక్రమం వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో బీఆర్‌ఎస్, జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పోటీపడి చేపట్టారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీపడి పక్క నియోజకవర్గమైన జనగామలో కూడా చేపట్టారు.
పాలకుర్తిలో మేళా ప్రారంభం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఈ రోజు జులై 17నుండి జులై 31వ తేదీ వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలన్న లక్ష్యంతో ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని మంత్రి సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం నేరమన్నారు. అందుకే తాముఈ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలకుర్తి లోని పార్టీ కార్యాలయంలో అప్లికేషన్స్ తీసుకుంటారని మంత్రి సూచించారు.