రాజస్థాన్‌లోనే బీజేపీకి స్పష్టమైన విజయావకాశాలు
రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, కానీ.. కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు పేర్కొంటున్నాయి. 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 100 సీట్లు లసాధించే పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

- ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌కే
- మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ
- మిజోరంలో జెడ్పీఎంకే విజయావకాశాలు
- అక్కడ ఊసులో లేని బీజేపీ
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, కానీ.. కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు పేర్కొంటున్నాయి. 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 100 సీట్లు లసాధించే పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. జన్‌కీ బాత్ అంచనా ప్రకారం బీజేపీ 100 నుంచి 122 సీట్లలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 62 నుంచి 85 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉన్నది. టీవీ9 భారత్ వర్ష్ – పోల్‌స్టర్ అంచనా ప్రకారం బీజేపీ 100 నుంచి 110 సీట్లలో, కాంగ్రెస్ 90-100 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి.
మిజోరంలో ఊసులో లేని బీజేపీ
మిజోరంలో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని జన్‌కీబాత్ తెలిపింది. ఇక్కడ ఆ పార్టీకి 15 నుంచి 25 సీట్లు వస్తాయని పేర్కొన్నది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉన్నాయి. 21 సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. మిజో నేషనల్ ఫ్రంట్ పది నుంచి 14 సీట్లు గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 5-9 సీట్ల మధ్య గెలుస్తుందని, బీజేపీ గరిష్ఠంగా 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌కేనన్న ఇండియాటుడే, టీవీ5 సర్వేలు
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారమని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా, టీవీ5 సర్వేలు తేల్చాయి. ఇక్కడ మొత్తం 90 సీట్లు ఉన్నాయి. మెజార్టీకి 46 స్థానాలు అవసరం ఉండగా.. కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాల మధ్య గెలుచుకునే అవకాశం ఉన్నదని ఇండియాటుడే పేర్కొన్నది. బీజేపీ కనీసంగా 36, గరిష్ఠంగా 46 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. ఇతరులు ఒకటి నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొన్నది. ఇక టీవీ 5 సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 54 నుంచి 64 సీట్లు లభించే అవకాశం ఉన్నది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 29 నుంచి 39 మధ్య లభిస్తాయి. జన్‌కీ బాత్ కూడా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌దేనని తేల్చింది. కాంగ్రెస్‌కు 42 53 స్థానాలు లభిస్తాయని పేర్కొన్నది. బీజేపీకి 34 నుంచి 45 సీట్లు వస్తాయని, ఇతరులు 3 చోట్ల విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏబీపీ న్యూస్-సీవోటర్ అంచనా ప్రకారం బీజేపీ 36-48 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ 41 నుంచి 56 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ కూడా కాంగ్రెస్‌కే మొగ్గు చూపింది. దాని అంచనా ప్రకారం కాంగ్రెస్ 46-56, బీజేపీ 30-40 మధ్య సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ.. కాంగ్రెస్‌కే అవకాశాలు!
మధ్యప్రదేశ్‌లో హోరాహోరీగా పోరు సాగిందని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని జన్‌కీబాత్, టీవీ9 భారత్ వర్స్-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో మెజార్టీ మార్క్ 116గా ఉన్నది. కాంగ్రెస్ 102-125 మధ్య గెలుస్తుందని, బీజేపీకి 100-123 మధ్య వస్తాయని జన్‌కీబాత్ పేర్కొనగా.. రిపబ్లిక్ టీవీ -మ్యాట్రిజ్ మాత్రం బీజేపీకి 118 నుంచి 130 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 97-107 మధ్య సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది.