Sivakasi| తమిళనాడు శివకాశీలో పేలుడు..10మంది మృతి

Sivakasi| తమిళనాడు శివకాశీలో పేలుడు..10మంది మృతి

విధాత : తమిళనాడులో భారీ పేలుడు చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ ముఖ్యకేంద్రమైన శివకాశిలోని ఒక గోడౌన్‌లో సంభవించిన పేలుడు ఘటనలో 10మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్‌పై దట్టమైన పొగలు అలుముకున్నాయి. సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.