కాబోయే భార్యపై అత్యాచారం.. అరెస్టు భయంతో ఆత్మహత్య
Karnataka | ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మరో ఆరు నెలల్లో పెళ్లి. కానీ అంతలోనే కాబోయే భార్యపై అత్యాచారం చేశాడు యువకుడు. రెండోసారి ఏకంగా ఆ యువతి ఇంటికి వెళ్లే అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపాడు. పరువు పోతుందేమోనని భావించి, ఆత్మహత్యగా చిత్రీకరించారు యువతి తల్లిదండ్రులు. కానీ ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయంతో యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని […]

Karnataka | ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మరో ఆరు నెలల్లో పెళ్లి. కానీ అంతలోనే కాబోయే భార్యపై అత్యాచారం చేశాడు యువకుడు. రెండోసారి ఏకంగా ఆ యువతి ఇంటికి వెళ్లే అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపాడు. పరువు పోతుందేమోనని భావించి, ఆత్మహత్యగా చిత్రీకరించారు యువతి తల్లిదండ్రులు.
కానీ ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయంతో యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ తాలుకా పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హసన్ తాలుకా పరిధిలోని రామనకొప్ప గ్రామానికి చెందిన యువతితో కడలూరు యువకుడికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమె ప్రస్తుతం మైనర్. 18 ఏండ్లు నిండడానికి మరో ఆరు నెలల సమయం ఉంది. దీంతో పెళ్లిని ఆరు నెలల తర్వాత నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక రోజు కాబోయే భార్య ఇంటికి ఆ యువకుడు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత మళ్లీ ఒక రోజు ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసిన అనంతరం గొంతు నులిమి చంపాడు. పరువు పోతుందేమోనని భావించి తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కానీ పోస్టుమార్టం నివేదికలో ఆమెపై హత్యాచారం జరిగిందని తేలింది.
ఇక యువకుడు భయంతో ఊగిపోయాడు. పోలీసులు తనను అరెస్టు చేస్తారేమోననే భయంతో విషం తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.