Noida | నోయిడా షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్ర‌మాదం

Noida  మూడో అంత‌స్థుపై నుంచి దూకిన ప‌లువురు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గ్రేట‌ర్ నోయిడాలోని ఒక భారీ షాపింగ్ మాల్‌లో గురువారం మ‌ధ్యాహ్నం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఇద్ద‌రు మూడో అంత‌స్థు నుంచి కింద‌కు దూకుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పైన ఉన్న వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి దూకు.. దూకు అంటున్న వాయిస్ వీడియోలో వినినిస్తున్న‌ది. గ్రేట‌ర్ నోయిడాలోని గౌర్‌సిటీ-1లో బిస్ర‌ఖ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని గెలాక్సీ ప్లాజా షాపింగ్ కాంప్లెక్స్‌లో […]

Noida | నోయిడా షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్ర‌మాదం

Noida

  • మూడో అంత‌స్థుపై నుంచి దూకిన ప‌లువురు
  • సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో

విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గ్రేట‌ర్ నోయిడాలోని ఒక భారీ షాపింగ్ మాల్‌లో గురువారం మ‌ధ్యాహ్నం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఇద్ద‌రు మూడో అంత‌స్థు నుంచి కింద‌కు దూకుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పైన ఉన్న వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి దూకు.. దూకు అంటున్న వాయిస్ వీడియోలో వినినిస్తున్న‌ది.

గ్రేట‌ర్ నోయిడాలోని గౌర్‌సిటీ-1లో బిస్ర‌ఖ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని గెలాక్సీ ప్లాజా షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. భ‌వ‌నం నుంచి ద‌ట్ట‌మైన పొగ బ‌య‌ట‌కు రావ‌డం, మూడో అంత‌స్థు నుంచి ఇద్ద‌రు కింద‌కు దూకుతున్న వీడియోలు షోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. భ‌వ‌నం నుంచి దూకిన ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయ‌ని ప్రాణపాయం ఏమీ లేద‌ని అధికారులు తెలిపారు. షాపింగ్ మాల్‌లో అగ్ని ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్యూటే కార‌ణ‌మ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

అగ్నిమాప‌క దళాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాయి. మంట‌ల‌ను అదుపు చేయ‌డంతోపాటు మాల్‌లో చిక్కుకున్న‌వారిని ర‌క్షిస్తున్నాయి. మాల్‌లో హోట‌ళ్లు, వివిధ రకాల షాప్‌లు ఉన్నాయి. అయితే, మాల్ లోప‌ల ఎంత‌మంది చిక్కుకున్నార‌నేది తెలియ‌డంలేదు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించి ఉచితంగా చికిత్స అందించాల‌ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు