Leopard: ఏడేళ్లకు ఆ జూలో చిరుతకు ఐదు కూనలు!

Leopard: ఏడేళ్లకు ఆ జూలో చిరుతకు ఐదు కూనలు!

Leopard : సహజంగా జంతు పరిరక్షణ శాలలో ఉండే జంతువులు తమ సంతానానికి జన్మనిస్తుండటం చూస్తుంటాం. అయితే అమెరికాలోని ఓ జూలో మాత్రం ఏడేళ్ల తర్వాత చిరుతకు పిల్లలు పుట్టడం ఆసక్తికరంగా మారింది. అమెరికాలోని మిస్సౌరిలోని సెయింట్ లూయిస్ జూ పార్క్ లో 12000కంటే ఎక్కువ జంతువులకు ఆశ్రయమిస్తుంది. అంతరించిన జంతుజాలం అభివృద్ధిపై ఈ జూ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల సెయింట్ లూయిస్ జూ కమ్యూనిటీలో ఐదుగురు కొత్త సభ్యులు చేరారు. ఇటీవల మదర్ కోరా అని పిలుచుకునే చిరుత ఐదు చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. “కోరాస్ క్వింట్స్” అని పిలువబడే ఈ చిరుత కూనలు జూకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఏడు సంవత్సరాలకు పైగా సెయింట్ లూయిస్ జూలో జన్మించిన చిరుత పిల్లలు ఇవే కావడం విశేషం.

 

మొదటిసారి తల్లి అయిన కోరా చిరుత తన నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. చిరుతలకు సగటున మూడు నుండి నాలుగు పిల్లలు పుడుతాయని..అరుదుగా ఐదుగురు పిల్లలు పుట్టడం జరుగుతుందని జూ క్యూరెటర్ జూలీ హార్టెల్-డినార్డో పేర్కొన్నారు. చిరుల పిల్లలకు ఇంకా పేరు పెట్టలేదని..ఈ ఏడాది చివరిలో వాటిని సందర్శకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.