Flight Door | బ‌ద్ద‌లైన‌ విమానం ఎమ‌ర్జెన్సీ డోరు.. ప్ర‌యాణం మ‌ధ్య‌లో, ఆకాశంలో ఉండ‌గా ఘ‌ట‌న‌

Flight Door భయాందోళ‌న‌తో హ‌డ‌లిపోయిన ప్ర‌యాణికులు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో విధాత‌: ఆకాశంలో ఉండ‌గా విమానం ఎమ‌ర్జెన్సీ డోరు బ‌ద్ధ‌లైతే ఎలా ఉంటుందో తెలుసా? భీక‌ర‌మైన గాలి విమాన ప్ర‌యాణికుల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? అలా ప్ర‌యాణికులు భ‌యంతో చేసే హాహాకారాలు ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘ‌ట‌న‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. బ్రెజిలియన్ గాయకుడు, పాటల రచయిత టియరీ తన సహచరులతో కలిసి విమానంలో […]

Flight Door | బ‌ద్ద‌లైన‌ విమానం ఎమ‌ర్జెన్సీ డోరు.. ప్ర‌యాణం మ‌ధ్య‌లో, ఆకాశంలో ఉండ‌గా ఘ‌ట‌న‌

Flight Door

  • భయాందోళ‌న‌తో హ‌డ‌లిపోయిన ప్ర‌యాణికులు
  • సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో

విధాత‌: ఆకాశంలో ఉండ‌గా విమానం ఎమ‌ర్జెన్సీ డోరు బ‌ద్ధ‌లైతే ఎలా ఉంటుందో తెలుసా? భీక‌ర‌మైన గాలి విమాన ప్ర‌యాణికుల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? అలా ప్ర‌యాణికులు భ‌యంతో చేసే హాహాకారాలు ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘ‌ట‌న‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. బ్రెజిలియన్ గాయకుడు, పాటల రచయిత టియరీ తన సహచరులతో కలిసి విమానంలో ప్ర‌యాణిస్తుండ‌గా, ఈ ఘటన చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో ఎవరూ గాయపడలేదని తెలిసింది.

బ్రేకింగ్ ఏవియేషన్ న్యూస్ & వీడియోస్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశారు. @బ్రెజిలియన్ సింగ‌ర్‌, పాటల రచయిత టియరీకి చెందిన‌ విమానంలో కార్గో డోర్ బ‌ద్ధ‌లైంది. అయినా, సావో లూయిస్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది* అని ట్వీట్ చేశారు.

ఎంబ్రేర్-110 అనే తేలిక‌పాటి విమానాన్నిబ్రెజిల్‌కు చెందిన ఎన్‌హెచ్ ఆర్ ఎయిర్ టాక్సీ అనే సంస్థ నిర్వ‌హిస్తున్న‌ది. టీయర్ బృందాన్ని ర‌వాణా చేస్తున్న‌ది. బ్రెజిల్ మారన్‌హావోలోని సావో లూయిస్‌లో ఒక ప్రదర్శన నిర్వ‌హించిన త‌ర్వాత విమానంలో బ‌య‌లు దేర‌గా, ఈ ఘ‌ట‌న జ‌రుగడంతో తిరిగి విమానం వెన‌క్కి వ‌చ్చింది. బ్యాండ్ సభ్యులు సురక్షితంగా దిగి తిరిగి హోటల్‌కి చేరుకున్నారు. ఈ ఘటనకు గ‌ల కారణాల‌పై విచార‌ణ జ‌రుగుతున్న‌ది.

ఈ నెల 14న ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా, ల‌క్షల సంఖ్య‌లో దానిని వీక్షించారు. ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు నెటిజ‌న్లు స్పందించారు. @చాలా గాలులతో కూడిన రైడ్ త‌ర‌హాలో ఉన్న‌ది* అని ఒక నెటిజ‌న్ రాశారు. “కెమెరామెన్‌తో సహా అందరూ చాలా ప్రశాంతంగా ఉండ‌టం చూసి నేను ఆశ్చర్యపోయాను” అని మరొకరు పేర్కొన్నారు. భ‌యాన‌క ప్ర‌యాణం ఇది.. అని ఇంకొక‌రు వ్యాఖ్యానించారు.