IndiGo Flight | విమానంలో లైంగిక వేధింపులు!
IndiGo Flight ఇండిగో ముంబై-గువాహటి విమానంలో ఘటన నిందితుడిని పోలీసులకు అప్పగించిన సిబ్బంది విధాత: విమానంలో తోటి ప్రయాణికులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగంపై మరో ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించినట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం వెల్లడించింది. ముంబై-గువాహటి మధ్య (ఇండిగో ఫ్లైట్) 6E- 5319లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై గువాహటి పోలీసులకు అప్పగించినట్టు తెలిపింది. ఇండిగో విమానంలో ముంబై నుంచి గువాహటికి ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు విమానంలోతనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు […]

IndiGo Flight
- ఇండిగో ముంబై-గువాహటి విమానంలో ఘటన
- నిందితుడిని పోలీసులకు అప్పగించిన సిబ్బంది
విధాత: విమానంలో తోటి ప్రయాణికులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగంపై మరో ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించినట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం వెల్లడించింది. ముంబై-గువాహటి మధ్య (ఇండిగో ఫ్లైట్) 6E- 5319లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై గువాహటి పోలీసులకు అప్పగించినట్టు తెలిపింది.
ఇండిగో విమానంలో ముంబై నుంచి గువాహటికి ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు విమానంలోతనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని గువాహటికి చేరుకోగానే పోలీసులకు సిబ్బంది సరెండర్ చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వెల్లడించింది. అవసరమైనప్పుడు ఎయిర్‌లైన్ దర్యాప్తులో సహాయం అందిస్తుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను ఎయిర్‌లైన్స్ షేర్ చేయలేదు