Viral Video | ఏనుగుల మధ్య భీకరమైన ఫైటింగ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Viral Video | అడవిలో జంతువుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం సహజమే. ఈ ఘర్షణలో ఒక్కోసారి జంతువులు ప్రాణాలు కూడా కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో జంతువుల మధ్య ఏర్పడిన ఘర్షణను అక్కడే ఉన్న మిగతా జంతువులు నివారించేందుకు యత్నిస్తాయి. అయితే ఓ దట్టమైన అడవిలో రెండు పిల్ల ఏనుగుల మధ్య భీకరమైన ఫైటింగ్ జరిగింది. ఇందులో ఒకటి చిన్న వయసులో ఉన్న ఏనుగు కాగా, మరొకటి పెద్దది. ఈ రెండు ఏనుగులు కూడా ఘర్షణకు దిగాయి. […]

Viral Video |
అడవిలో జంతువుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం సహజమే. ఈ ఘర్షణలో ఒక్కోసారి జంతువులు ప్రాణాలు కూడా కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో జంతువుల మధ్య ఏర్పడిన ఘర్షణను అక్కడే ఉన్న మిగతా జంతువులు నివారించేందుకు యత్నిస్తాయి.
అయితే ఓ దట్టమైన అడవిలో రెండు పిల్ల ఏనుగుల మధ్య భీకరమైన ఫైటింగ్ జరిగింది. ఇందులో ఒకటి చిన్న వయసులో ఉన్న ఏనుగు కాగా, మరొకటి పెద్దది. ఈ రెండు ఏనుగులు కూడా ఘర్షణకు దిగాయి. చిన్న ఏనుగుపై పెద్ద ఏనుగు దాడి చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఏనుగుల గుంపు.. ఆ ఘర్షణను ఆపాయి. చిన్న ఏనుగును చేరదీశాయి. దాంతో రెండు ఏనుగులు విడిపోయాయి.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్టు సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఎప్పుడైతే కజిన్స్ ఫైటింగ్ చేస్తాయో.. తమ పెద్దవారు తప్పకుండా జోక్యం చేసుకోవాలని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.