మాజీ ఎమ్మెల్యే అర్దనగ్న ప్రదర్శన
విధాత: కరెంట్ కోతలు, పంటల బీమా, రుణమాఫీ తదితర సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ శనివారం మండల పరిధిలోని రాయినిపాలెం గ్రామంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. నీరందక ఎండిన వరి పొలాలు పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ నేడు కరెంట్ కోతలు విధిస్తూ రైతుల […]

విధాత: కరెంట్ కోతలు, పంటల బీమా, రుణమాఫీ తదితర సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ శనివారం మండల పరిధిలోని రాయినిపాలెం గ్రామంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.
నీరందక ఎండిన వరి పొలాలు పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ నేడు కరెంట్ కోతలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్రకటిత విద్యుత్ కోతలతో తమ పంటను కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ ఎత్తివేసి కాలువ చివరి భూములకు నీరందించేలా నిరంతరం నీటి విడుదల చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో వడ్డీ భారం రైతులపై పడుతోందన్నారు. బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్, మోహన్ రెడ్డి, భాస్కర్, మంద రవి, కాకునూరి రవి, చల్లా రాములు, రాములు, శ్రీను, వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు.