Vivek |
విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: పెద్దపల్లి పార్లమెంటు మాజీ ఎంపీ గడ్డం వివేక్ గత కొంతకాలంగా బిజెపి పార్టీతో అంటిముట్టనట్లు దూరం ఉంటున్నాడని ప్రచారం కొనసాగుతుంది. గడ్డం వివేక్ తండ్రి కాక వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు.
గత పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో గడ్డం వివేక్ రాజకీయ ప్రస్థానం ముగిసింది అనుకున్న నేపథ్యంలో గడ్డం వివేక్ బిజెపి పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించాడు. బిజెపి పార్టీ వివేక్‌కు క్రియాశీలక పదవి అప్పగించింది. బిజెపి పార్టీ కోర్ కమిటీ సభ్యునిగా నియమించడంతో వివేక్ బిజెపి పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు.
వివేక్ నేతృత్వంలో హుజురాబాద్, దుబ్బాక ఎన్నికలతో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబానికి ఎనలేని గౌరవం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి వివేక్ గెలుపొందాడు. వివేక రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
అనంతరం వివేక్ టీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నాడు. 2019లో పెద్దపల్లి ఎంపీ టికెట్ టిఆర్ఎస్ పార్టీ నుండి ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం పలు ఆరోపణల మీద వివేక్‌కు ఇవ్వకుండా వెంకటేష్ నేతకు పెద్దపల్లి పార్లమెంట్ సీటు అప్పగించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వీడి వివేక్ బిజెపి పార్టీలో చేరి కాషాయం కండువా కప్పుకున్నాడు.
వివేక్ అన్న వినోద్ కూడా కాంగ్రెస్ పార్టీలో చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాక వెంకటస్వామి కాంగ్రెస్ లో పలు కీలక పదవులు అనుభవించాడు. పార్టీ మారకుండా జీవితకాలం పార్టీలోనే కొనసాగాడు. వివేక్ మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ సాధించిన తర్వాత టిఆర్ఎస్ పుంజుకున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలోకి మారారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీ సీటు వివేక్ వస్తుందని భావించిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం అనూహ్య పరిస్థితులో చెన్నూరు నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ చేతిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన వెంకటేష్ నేత టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం వెనువెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం గెలుపొందడం కూడా జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయలేదని ఆరోపణలు వెళ్లి విరిసిన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థి వర్గానికి సహాయ సహకారాలు అందించాడని ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ చివరలో వివేక్ కు కాదని వెంకటేష్ నేతకు అప్పగించింది .
ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల అనంతరం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాషాయ కండువా కప్పుకొని బిజెపి పార్టీ బలోపేతం కోసం అలుపెరుగని కృషి చేశాడని పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో అప్పటికే అక్కడ బిజెపి పరిపాలిస్తున్న నేపథ్యంలో బిజెపికి కాదని ప్రజలు హస్తానికి పట్టాభిషేకం చేయడంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారినయని చెప్పవచ్చు.
అప్పటివరకు తెలంగాణలో , టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అనుకున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల అనంతరం అలాగే ఖమ్మం రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో చాలామంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పక తప్పదు . కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ కావడం అప్పటిదాకా మంచి జోష్ మీద ఉన్న బిజెపి, కర్ణాటక ఎన్నికలతో తెలంగాణలో బిజెపి గ్రాఫ్ తగ్గిందానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు స్టేట్ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు . బిజెపి పార్టీలోకి వివేక్ తర్వాత చేరిన ఈటల రాజేందర్ కు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించడం.
వివేకు కు తగిన తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రచారం ఉంది . ఈ నేపథ్యంలో నిన్న దేశ ప్రధాని మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బిజెపి కోర్ కమిటీ సభ్యుడు వివేక్ డుమ్మ కొట్టడం నేపథ్యంలో వివేక్ పార్టీ మారుతాడు అనే ప్రచారం చెక్కర్లు కొడుతుంది.
ఇప్పటికే మూడు పార్టీలలో పనిచేసిన వివేక్ బిజెపిని వీడి తన కుటుంబం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లో లో కీలక పదవులు అనుభవించి రాజకీయ ఓనమాలు నేర్పించిన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడా ? లేక గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సమయానికి టికెట్ ఇవ్వకుండా అవమాన పరిచిన టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడా అని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
కొంతమంది టిఆర్ఎస్ పార్టీ తో మాట్లాడుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ అడిగాడని దానికి టిఆర్ఎస్ పార్లమెంట్ సీటు ఇస్తామన్నట్లు ప్రచారం కొనసాగుతుంది . అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ హామీ తర్వాతనే టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తడని మరో ప్రచారం కొనసాగుతుంది.
అసెంబ్లీ టికెట్ కాకుండా పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇస్తామని ఇప్పటికే పార్టీ నుంచి హామీ ఇచ్చినట్లు సమాచారం . వివేక్ నుండి మాత్రం పార్టీ మార్పుపై మౌనమే కొనసాగుతుంది . రాజకీయ విశ్లేషకులు మాత్రం రకరకాల ఊహాగాలను చర్చోప చర్చలు కొనసాగిస్తున్నారు . ఏది ఏమైనప్పటికీ పార్టీ మార్పుపై వివేక్ మౌనంగానే ఉన్నారు . వివేక్ పార్టీ మారితే ఇప్పటికే మూడు పార్టీలు తిరిగిన వివేక్ ఏ పార్టీలో చేరుతాడనే చర్చ మాత్రం ఆసక్తిగా కొనసాగుతుంది.