ఎన్టీఆర్ మార్గ్‌లో ఫార్ములా ఈ రేస్.. సచివాలయం రోడ్డు మూసివేత
Formula E Race | ఫార్ములా ఈ రేస్ లీగ్‌కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంలో ఈ రేస్‌ను నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 16 నుంచి 20వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం రోడ్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు […]

Formula E Race | ఫార్ములా ఈ రేస్ లీగ్‌కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంలో ఈ రేస్‌ను నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 16 నుంచి 20వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం రోడ్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రేస్‌కు సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రెగ్యులర్, వీకెండ్ పాస్ పేరిట టికెట్లను జారీ చేస్తున్నారు. రెగ్యులర్ పాస్‌ను రూ. 749కి విక్రయిస్తున్నారు. ఇది కేవలం 19వ తేదీకి మాత్రమే వర్తిస్తుంది. వీకెండ్ పాస్‌ను రూ. 1,249కి విక్రయిస్తున్నారు. ఈ పాస్ రెండు రోజులకు వర్తిస్తుంది. లీగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు బుక్ మై షోలో టికెట్లు కొనుగోలు చేయవచ్చని నిర్వహకులు పేర్కొన్నారు. టికెట్ల బుకింగ్స్, ఇతర విషయాల కోసం https://in.bookmyshow.com/hyderabad/sports/indian-racing-league-weekend-pass/ET00343449 ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.