Tirumala | ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత
తిరుమల నడకమార్గం సుగమం Tirumala | విధాత, తిరుమల: తిరుమల నడకమార్గంలో కలకలం రేపిన చిరుతలు పట్టుబడ్డాయి. ఇదివరకే మూడు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. తాజాగా ఆదివారం రాత్రి నాలుగో చిరుత చిక్కింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో చిరుతలు గత కొద్దిరోజులుగా భక్తులు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టాయి. ఈ క్రమంలో అధికారులు ‘ఆపరేషన్ చిరుత’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నడకమార్గం ఇరువైపులా ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు […]
- తిరుమల నడకమార్గం సుగమం
Tirumala | విధాత, తిరుమల: తిరుమల నడకమార్గంలో కలకలం రేపిన చిరుతలు పట్టుబడ్డాయి. ఇదివరకే మూడు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. తాజాగా ఆదివారం రాత్రి నాలుగో చిరుత చిక్కింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో చిరుతలు గత కొద్దిరోజులుగా భక్తులు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టాయి. ఈ క్రమంలో అధికారులు ‘ఆపరేషన్ చిరుత’ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా నడకమార్గం ఇరువైపులా ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఏడో మైలు సమీపంలో ఉంచిన బోనులో చిరుత బంధీ అయ్యింది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. దీంతో శేషాచల కొండల్లో ఆపరేషన్ చిరుత ముగిసింది. ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram