France | ఐఫోన్ 12 నుంచి ప‌రిమితికి మించి రేడియేష‌న్‌.. అమ్మ‌కాల నిలిపివేసిన ఫ్రాన్స్‌

France విధాత: ఐఫోన్‌ 12ను లాంచ్ చేసిన రోజే ఆపిల్‌ సంస్థ‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఫ్రాన్స్‌ (France) లో ఆ మోడ‌ల్ అమ్మ‌కాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని ఆ దేశ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మోడ‌ల్‌ నుంచి ప‌రిమిత స్థాయిని మించి రేడియేష‌న్ వ‌స్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దేశీయ ప‌రిశోధ‌న సంస్థ ఏఎన్ఎఫ్ఆర్ నివేదిక ప్ర‌కారం ఐఫోన్ 12 ఫోన్ల నుంచి ఎక్కువ స్థాయిలో ఎల‌క్ట్రోమాగ్నెటిక్ రేడియేష‌న్ వెలువ‌డుతోంద‌ని […]

  • By: Somu    latest    Sep 13, 2023 10:41 AM IST
France | ఐఫోన్ 12 నుంచి ప‌రిమితికి మించి రేడియేష‌న్‌.. అమ్మ‌కాల నిలిపివేసిన ఫ్రాన్స్‌

France

విధాత: ఐఫోన్‌ 12ను లాంచ్ చేసిన రోజే ఆపిల్‌ సంస్థ‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఫ్రాన్స్‌ (France) లో ఆ మోడ‌ల్ అమ్మ‌కాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని ఆ దేశ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మోడ‌ల్‌ నుంచి ప‌రిమిత స్థాయిని మించి రేడియేష‌న్ వ‌స్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

దేశీయ ప‌రిశోధ‌న సంస్థ ఏఎన్ఎఫ్ఆర్ నివేదిక ప్ర‌కారం ఐఫోన్ 12 ఫోన్ల నుంచి ఎక్కువ స్థాయిలో ఎల‌క్ట్రోమాగ్నెటిక్ రేడియేష‌న్ వెలువ‌డుతోంద‌ని తేలింది. స్పెసిఫిక్ అబ్సార్ప్ష‌న్ రేట్ (ఎస్ఏఆర్‌) తాము అనుమ‌తించిన దాని కంటే ఎక్కువ‌గా ఉంద‌ని డిజిటల్ ఎకానమీ జూనియ‌ర్ మినిస్ట‌ర్ జీన్ నోయ‌ల్ బారొట్ ఒక ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఎస్ఏఆర్ అనేది యురోపియ‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక కిలోగ్రాంకు 4.0 వాట్‌లు ఉండాల్సి ఉండ‌గా.. తాజా యాపిల్ మోడ‌ల్‌ కిలోగ్రాంకు 5.74 వాట్‌ల రేడియేష‌న్‌ను వెలువ‌రిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. దీంతో ఐఫోన్ 12 అమ్మ‌కాల‌కు నిలిపివేయాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే అమ్ముడైన హ్యాండ్ సెట్‌ల‌కు సంబంధించి ఆపిల్ సంస్థ దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

అయితే ఈ స‌మ‌స్య‌కు ఒక సాధార‌ణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ స‌రిపోతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విష‌యంపై ఆపిల్ సంస్థ స్పందించ‌ల‌డానికి రెండు వారాల స‌మ‌యం ఇచ్చామ‌ని.. ఒక వేళ వారు విఫ‌ల‌మైతే ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న ఐఫోన్ 12ల‌ను వెన‌క్కి రప్పించ‌డానికి కూడా వెన‌కాడ‌బోమని సంబంధిత వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. నిబంధ‌న‌లు పెద్ద సంస్థ‌కైనా చిన్న సంస్థ‌కైనా ఒక్క‌టేన‌ని పేర్కొన్నాయి