రైలు కూతల నుంచి విముక్తి కల్పించండి: విజ‌య‌వాడ వాసుల వేడుకోలు

అనారోగ్యం పాల‌వుతున్నామని ఆవేద‌న‌ విధాత‌: విజ‌య‌వాడ అజిత్‌సింగ్ న‌గ‌ర్ వాసుల‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. రైళ్లు పెట్టే కూత‌ల నుంచి త‌మ‌కు విముక్తి క‌లిగించాల‌ని రైల్వే అధికారుల‌కు మొర‌పెట్టుకొంటున్నారు. వీలైనంత త్వ‌ర‌గా రైలు హార‌న్ల బాధ‌ను తొల‌గించి త‌మ ఆరోగ్యాల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు. విజ‌య‌వాడ‌లోని అజిత్ సింగ్‌న‌గ‌ర్ వాసులు రైలు ప‌ట్టాల‌కు వంద‌మీట‌ర్ల దూరంలోనే ద‌శాబ్దాలుగా నివ‌సిస్తున్నారు. రాత్ర‌న‌క‌, ప‌గ‌ల‌న‌క తిరిగే రైళ్లు న‌గ‌ర ప్రాంతం కాబ‌ట్టి త‌ర‌చుగా హార‌న్ చ‌ప్పుడు చేస్తూనే వ‌స్తూ పోతున్నాయి. […]

  • Publish Date - December 21, 2022 / 10:56 AM IST
  • అనారోగ్యం పాల‌వుతున్నామని ఆవేద‌న‌

విధాత‌: విజ‌య‌వాడ అజిత్‌సింగ్ న‌గ‌ర్ వాసుల‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. రైళ్లు పెట్టే కూత‌ల నుంచి త‌మ‌కు విముక్తి క‌లిగించాల‌ని రైల్వే అధికారుల‌కు మొర‌పెట్టుకొంటున్నారు. వీలైనంత త్వ‌ర‌గా రైలు హార‌న్ల బాధ‌ను తొల‌గించి త‌మ ఆరోగ్యాల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు.

విజ‌య‌వాడ‌లోని అజిత్ సింగ్‌న‌గ‌ర్ వాసులు రైలు ప‌ట్టాల‌కు వంద‌మీట‌ర్ల దూరంలోనే ద‌శాబ్దాలుగా నివ‌సిస్తున్నారు. రాత్ర‌న‌క‌, ప‌గ‌ల‌న‌క తిరిగే రైళ్లు న‌గ‌ర ప్రాంతం కాబ‌ట్టి త‌ర‌చుగా హార‌న్ చ‌ప్పుడు చేస్తూనే వ‌స్తూ పోతున్నాయి. దీంతో ఆ ప్రాంత‌మంతా రైలు కూత‌ల‌తో నిరంత‌రం ద‌ద్ద‌రిల్లిపోతుంది.

దీంతో రైళ్లు పెట్టే హార‌న్ చ‌ప్పుడుతో ఇబ్బంది ప‌డుతూ, అనారోగ్యం పాల‌వుతున్నారు. వృద్దులు, పిల్ల‌లు, మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ర‌క్త‌పోటు, మ‌ధుమేహం, హైప‌ర్ టెన్ష‌న్‌, త‌ల‌నొప్పి, చ‌ర్మ‌వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గ‌ర్భిణీ స్త్రీలు తీవ్ర అనారోగ్యానికి గుర‌వుతున్నారు.

దీంతో, త‌క్ష‌ణ ప‌రిష్కారంగా.. రైలు హార‌న్ల‌ను రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల దాకా మోగించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. న‌గ‌ర ప్రాంతం కాబ‌ట్టి ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా ఉండాలంటే.. హార‌న్లు మోగించాల్సి వ‌స్తుంద‌ని అంటే.. ఆ స‌మ‌యంలో రైల్వే పోలీసుల‌తో ఆ స‌మయాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తే సరిపోతుంద‌ని రైల్వే అధికారుల‌కు సూచించారు.

స‌మ‌స్య ప‌రిష్కారానికి రైల్వే అధికారులు చ‌ర్య‌లు తీసుకోకుంటే.. పౌర‌సంక్షేమ సంఘం త‌ర‌పున భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు పూనుకుంటామ‌ని తెలిపారు. త‌మ ఆరోగ్యం క‌న్నా మ‌రేమీ ఎక్కువ కాద‌ని స్థానిక పౌర‌సంక్షేమ సంఘం ప్ర‌భుత్వానికి తెలియజేసింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో రైలు హార‌న్ల బాధ‌నుంచి త‌మ‌కు విముక్తి కలిగించాల‌ని కోరుతూ అజిత్‌సింగ్ న‌గ‌ర్ వాసుల త‌ర‌పున అవ‌నిగ‌డ్డ పున్నారావు కేంద్ర రైల్వేశాఖా మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు ఓ విజ్ఞాప‌న పత్రాన్ని రాశారు. ఆ లేఖ ప్ర‌తిని వివిధ రైల్వేశాఖ అధికారుల‌కు కూడా పంపారు.