సీఎం స్టాలిన్‌ సంచలన నిర్ణయం.. అవయవదాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

సీఎం స్టాలిన్‌ సంచలన నిర్ణయం.. అవయవదాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

విధాత : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం కీలం నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసే వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. అవయవదానంను ప్రొత్సహించేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుందని స్టాలిన్‌ ప్రభుత్వం పేర్కోంది. అవయవదానం కుటుంబాలను ప్రభుత్వం తరుపున గౌరవించే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్టాలిన్‌ తెలిపారు. దేశంలోనే తమిళనాడు అవయవదానంలో అగ్రగామిగా ఉండటం గమనార్హం.