Gaddar | దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి: ప్రజాగాయకుడు గద్దర్‌

Gaddar విధాత: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్‌ తెలిపారు. పీసీసీ ఆహ్వానం మేరకు యువ సంఘర్షణ సభకు వచ్చానని చెప్పిన గద్దర్‌ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ లిబరల్ పార్టీ, అభ్యుదయ పార్టీ అని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు అని తెలిపారు. తాను కేసీఆర్‌ మీదనే పోటీ చేస్తానని అన్నారు. పేదలు, విద్యార్థుల ఉసురు తగిలి కేసీఆర్‌ పోతాడని పాట రూపంలో గద్దర్‌ చెప్పారు. రాష్ట్రంలోని ఆరు […]

  • Publish Date - May 8, 2023 / 03:37 PM IST

Gaddar

విధాత: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్‌ తెలిపారు. పీసీసీ ఆహ్వానం మేరకు యువ సంఘర్షణ సభకు వచ్చానని చెప్పిన గద్దర్‌ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ లిబరల్ పార్టీ, అభ్యుదయ పార్టీ అని అన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు అని తెలిపారు. తాను కేసీఆర్‌ మీదనే పోటీ చేస్తానని అన్నారు. పేదలు, విద్యార్థుల ఉసురు తగిలి కేసీఆర్‌ పోతాడని పాట రూపంలో గద్దర్‌ చెప్పారు.

రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది ప్రజలు నా పార్టీ అని అన్నారు. ప్రజలంతా నాపార్టీలో ఉంటే అన్ని పార్టీలు తన వెనకాలే వస్తాయన్నారు.

ప్రజా గాయకుడు గద్దర్‌ కాంగ్రెస్‌ పార్టీ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సభకు హాజరై ప్రజా సమస్య లపై గళమెత్తారు. గద్దర్‌ పాటలు సభకు హాజరైన వారిని ఉత్తేజ పరిచాయి.

Latest News