Nalgonda, Ganja l 84 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
Ganja, సిబ్బందిని అభినందించిన ఎస్పీ అపూర్వా రావు పరారీలో మరొకరు విధాత: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి 12 లక్షల విలువైన 42 ప్యాకెట్లు 84 కిలోల గంజాయి (Marijuana) స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ (Nalgonda) జిల్లా ఎస్పీ అపూర్వ రావు (SP Apoorva rao) తెలిపారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు శుక్రవారం ఉదయం నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామ శివారు గడ్డివాము వద్ద […]

Ganja,
- సిబ్బందిని అభినందించిన ఎస్పీ అపూర్వా రావు
- పరారీలో మరొకరు
విధాత: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి 12 లక్షల విలువైన 42 ప్యాకెట్లు 84 కిలోల గంజాయి (Marijuana) స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ (Nalgonda) జిల్లా ఎస్పీ అపూర్వ రావు (SP Apoorva rao) తెలిపారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఎస్పీ కథనం మేరకు శుక్రవారం ఉదయం నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామ శివారు గడ్డివాము వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా ఉన్నారని సమాచారం అందింది. నకిరేకల్ ఎస్ఐ కె.రంగారెడ్డి, సిబ్బందితో వెళ్ళగా వారిని చూసి ఇద్దరిలో ఒక వ్యక్తి పారిపోగా, మరొకరు పట్టుబడ్డారు. అతడిని విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం రామచంద్రపురానికి చెందిన డ్రైవర్ కొండ తేజ్ కుమార్ (28)గా తన వివరాలు వెల్లడించాడు.
సులభంగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో తేజ్ కుమార్ మరో వ్యక్తితో కలిసి రత్నంపేట, నర్సిపట్నం, విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రీనివాస్ వద్ద కిలో 5,000 రూపాయల రేటుతో 4,20,000లు చెల్లించి 42 ప్యాకెట్ల గంజాయి (84 KGs) ని కొనుగోలు చేసి, హైద్రాబాద్‌లో విక్రయించడానికి తీసుకొచ్చారు.
కొనుగోలుదారులు అందుబాటులో లేనందున మూడు రోజుల క్రితం తాటికల్ గ్రామ శివారులో గల గడ్డివాములో దాచిపెట్టారు. హైద్రాబాద్ (Hydrabad)కి తీసుకెళ్లి అక్కడ కావలిసిన వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించుకొని, సరుకు దాచిపెట్టిన గడ్డివాము దగ్గరకి చేరుకున్నారు.
ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు ఛేదించిన నల్గొండ డీఎస్పీ నరసింహారెడ్డి, శాలిగౌరారం సిఐ రాఘవరావు, ఎస్ఐ కె. రంగా రెడ్డి, పి.సి వెంకటేశ్వర్లు, మధుకర్, రమేష్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.