Warangal | బీజేపీ టికెట్ కోసం గంట రవి దరఖాస్తు

వరంగల్ తూర్పు నుంచి పోటీకి సంసిద్ధత బీసీ బిడ్డకు ఒక్కచాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి వినతి Warangal | విధాత, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ పార్టీ యువనేత గంట రవికుమార్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులకు తన దరఖాస్తును అందజేశారు. పార్టీ తనకు పోటీ చేసే అవకాశం ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం […]

  • By: Somu    latest    Sep 04, 2023 12:27 AM IST
Warangal | బీజేపీ టికెట్ కోసం గంట రవి దరఖాస్తు
  • వరంగల్ తూర్పు నుంచి పోటీకి సంసిద్ధత
  • బీసీ బిడ్డకు ఒక్కచాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి వినతి

Warangal | విధాత, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ పార్టీ యువనేత గంట రవికుమార్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులకు తన దరఖాస్తును అందజేశారు. పార్టీ తనకు పోటీ చేసే అవకాశం ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో అధిష్టానం పిలుపుతో ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నట్టు చెప్పారు. బీసీలు ఎక్కువగా ఉన్నందున ఒక బీసీ బిడ్డగా అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా చెప్పుకోవడమే తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఏ అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

స్మార్ట్ సిటీ కింద కేంద్రం నిధులు ఇచ్చినా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడా చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. కనీసం ఇప్పటివరకు కలెక్టరేట్ ఏర్పాటు చేయలేదని, ప్రతి చిన్న పనికి ప్రజలు పక్క జిల్లాకు పరుగులు తీయాల్సిన దుస్థితి వచ్చిందని.. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ ఎద్దేవా చేశారు.

కనీసం వరంగల్ బస్టాండ్ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, నగర రోడ్లను విస్తరించలేదని, అస్తవ్యస్త పనులతో ట్రాఫిక్ సమస్యల్ని మరింత పెంచారని ఆరోపించారు. తన సేవా కార్యక్రమాలు కూడా దృష్టిలో పెట్టుకొని అధిష్టానం బీజేపీ నుంచి బరిలో నిలిపే అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.