Canada | ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ మంచు ఫలకం.. ఎక్కడంటే
Canada | నగరంలోని సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ భారీ మంచు ఫలకం (Ice Burg) అక్కడి వాసులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. కెనడా (Canada) లోని న్యూ ఫౌండ్ ఐలాండ్‌కు ఈ భారీ అతిథి వచ్చినట్టు ఎక్స్ (ట్విటర్)లో వైరల్ అవుతున్న వీడియో ద్వారా తెలుస్తోంది. దీని వైశాల్యం సరిగ్గా టైటానిక్ (Titanic) మునిగి పోవడానికి కారణమైన ఐస్‌బర్గ్ ఎలీ అంతే ఉండటం గమనార్హం. స్ప్రింటవార్ టీం అనే యూజర్ దీనిని సంబంధించి ఒక నిమిషం వీడియోను […]
Canada |
నగరంలోని సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ భారీ మంచు ఫలకం (Ice Burg) అక్కడి వాసులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. కెనడా (Canada) లోని న్యూ ఫౌండ్ ఐలాండ్‌కు ఈ భారీ అతిథి వచ్చినట్టు ఎక్స్ (ట్విటర్)లో వైరల్ అవుతున్న వీడియో ద్వారా తెలుస్తోంది. దీని వైశాల్యం సరిగ్గా టైటానిక్ (Titanic) మునిగి పోవడానికి కారణమైన ఐస్‌బర్గ్ ఎలీ అంతే ఉండటం గమనార్హం.
స్ప్రింటవార్ టీం అనే యూజర్ దీనిని సంబంధించి ఒక నిమిషం వీడియోను పోస్ట్ చేయగా.. నిమిషాల్లోనే అది వైరల్‌గా మారిపోయింది. అయితే భారీ మంచు ఫలకాలు ఒడ్డుకు రావడం ఇక్కడ మామూలు విషయమే. ఇక్కడకి సమీపంలోనే ఉన్న వెస్ట్రన్ గ్రీన్‌ల్యాండ్ నుంచి ఎక్కువ మంచు ఫలకాలు వస్తాయి. కొన్ని కెనడా పరిధిలోని ఆర్కిటిక్ నుంచి వచ్చే అవకాశమూ ఉంది.
మంచు ఫలకాలు తమకు కనిపించడం సాధారణమే అయినప్పటికీ.. ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు ఫలకాలకు కలుగుతున్న ముప్పునకు ఇది సంకేతమని వారు పేర్కొన్నారు.
మరోవైపు గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్న గ్లేసియర్‌లు అంచనా వేసిన దాని కంటే నాలుగు రెట్లు వేగంగా కరిగి పోతున్నాయని 2019లో ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ ద యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. 2023లో ఇప్పటి వరకు ఇలాంటి 2,265 ఐస్‌బర్గ్‌లు తమ కంట పడ్డాయని లాబ్రడార్ రీజియన్‌పై పరిశోధనలు చేస్తున్న ఇంటర్నేషనల్ ఐస్ పేట్రోల్ వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram