మళ్లీ తగ్గిన బంగారం..! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. వరుసగా రెండోరోజు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది

మళ్లీ తగ్గిన బంగారం..! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

Gold Rates | మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. వరుసగా రెండోరోజు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 తగ్గడంతో తులం ధర రూ.56,700 పలుకుతుంది. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 తగ్గడంతో తులం రూ.61,910కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,400 పలుకుతున్నది.


దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,900 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం 62,060కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,910కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,910 పలుకుతున్నది.


మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. కిలోకు రూ.100 తగ్గి.. రూ.75,700కి దిగివచ్చింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,700 పలుకుతున్నది. ఇదిలా ఉండగా ప్లాటినం ధర సైతం దిగివచ్చింది. తులం ప్లాటినంపై రూ.50 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్లాటినం రూ.24,470 వద్ద ట్రేడవుతున్నది.