Gold Rates | మగువలకు ఊరట.. తులం బంగారంపై ఎంత ధర తగ్గిందంటే..?

Gold Rates | పసడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ధరలు శనివారం కాస్త తగ్గుముఖం పట్టింది. దాంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయ్యింది. దేశవ్యాప్తంగా శనివారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 వరకు తగ్గి రూ.55,750కి దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220 తగ్గి రూ.60,820కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 55,900, ఇక 24 క్యారెట్ల […]

Gold Rates | మగువలకు ఊరట.. తులం బంగారంపై ఎంత ధర తగ్గిందంటే..?

Gold Rates | పసడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ధరలు శనివారం కాస్త తగ్గుముఖం పట్టింది. దాంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయ్యింది. దేశవ్యాప్తంగా శనివారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 వరకు తగ్గి రూ.55,750కి దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220 తగ్గి రూ.60,820కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 55,900, ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,970 వద్ద ట్రేడవుతున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.60,820 పలుకుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.రూ. 61,310గా ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,870 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 పలుకుతున్నది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రూ.60,820కి చేరింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.300 వరకు తగ్గి.. రూ.76,200కి చేరింది. హైదరాబాద్‌లో కిలోకు రూ.80వేలు, ముంబయిలో రూ.76,200 పలుకుతున్నది. ఇక సంపన్నులు లోహంగా పేర్కొనే ప్లాటీనం ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో తగ్గాయి. 10 గ్రాముల పాట్లీనం ధర రూ.360కి తగ్గి.. తులానికి రూ 28,370 వద్ద ట్రేడవుతున్నది.