Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు !

పసిడి ధరల పరుగులు కాస్తా నెమ్మదించాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500తగ్గి రూ.85,600వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 540తగ్గి రూ.93,380వద్ధ ఆగింది.

  • By: Somu    latest    Apr 03, 2025 11:16 AM IST
Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు !

Gold Rate: పసిడి ధరల పరుగులు కాస్తా నెమ్మదించాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500తగ్గి రూ.85,600వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 540తగ్గి రూ.93,380వద్ధ ఆగింది. బెంగుళూర్, చైన్నై, ముంబైలోనూ లో 22క్యారెట్లకు రూ.85,600, 24క్యారెట్లకు 93,380వద్ధ కొనసాగింది.

న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.85,750, 24క్యారెట్లకు రూ.93,530వద్ధ కొనసాగింది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.81,292, 24క్యారెట్లకు రూ. 87,765 గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.80,972, 24క్యారెట్లకు రూ.86,542 వద్ధ కొనసాగింది.

ఇకపోతే వెండి ధరలు కిలో రూ.1,12,000 వద్ధ కొనసాగుతోంది. క్రితం రోజు ధరతో పోల్చితే రూ.2వేలు తగ్గింది.

ట్రంప్ టారీఫ్ లతో బంగారం లక్ష?
రేపోమాపో తులం బంగారం ధర లక్ష రూపాయలను చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే ఆల్‌టైమ్‌ రికార్డును చేరిన పసిడి ధరలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధిస్తున్న టారిఫ్‌ల ఎఫెక్ట్ తో మరింత పరుగులు పెడుతుందన్న అంచనాలున్నాయి. ట్రంప్ టారిఫ్ లకు తోడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడానికి డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా కారణమే. రూపీ మరింతగా పతనమైతే పసిడి విలువ కూడా అంతే స్థాయిలో విజృంభిస్తుంది. మొత్తానికి ఈ ఏడాది భారతీయ మార్కెట్‌లో 24క్యారెట్ల తులం బంగారం లక్ష రూపాయలను దాటడం ఎంతో దూరంలో లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.