Gold Rates | మగువలకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన పుత్తడి ధరలు..! హైదరాబాద్‌లో తులం ఎంత ఉందంటే..!
Gold Rates | బంగారం ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. దేశంలో బంగారం ధరలు శనివారం భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.400 పెరిగి.. రూ.55,600కి చేరింది. 24 క్యారెట్ల తులం పుత్తడిపై రూ.430 వరకు పెరిగి రూ.60,650 వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,830కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల […]

Gold Rates | బంగారం ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. దేశంలో బంగారం ధరలు శనివారం భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.400 పెరిగి.. రూ.55,600కి చేరింది. 24 క్యారెట్ల తులం పుత్తడిపై రూ.430 వరకు పెరిగి రూ.60,650 వద్ద స్థిరపడింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,830కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,680కి పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61వేల వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,730 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,680 పలుకున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. కిలో వెండిపై రూ.1100 పెరిగి రూ.74,500కి చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,700 పలుకుతోంది.