Gold Rates | బతుకమ్మ పండుగకు ముందు.. సామాన్యులకు ఊరటనిచ్చిన బంగారం

Gold Rates | బతుకమ్మ పండుగకు ముందు పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇటీవల రికార్డుస్థాయిలో పెరుగుతూ వచ్చిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. బంగారం అంటేనే హడలిపోయే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Reported by: Mallanna | వాణిజ్యం | Oct 01, 2024, 11:08 am IST
Read Time: 3 mins
Gold Rates | బతుకమ్మ పండుగకు ముందు.. సామాన్యులకు ఊరటనిచ్చిన బంగారం

Gold Rates | బతుకమ్మ పండుగకు ముందు పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇటీవల రికార్డుస్థాయిలో పెరుగుతూ వచ్చిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. బంగారం అంటేనే హడలిపోయే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులానికి రూ.70,500కి తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.330 పతనమై.. తులానికి రూ.76,910 దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.70,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,910కి తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.70,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,060 పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,910కి దిగివచ్చింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.70,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,910 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో రూ.95వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలోకు రూ.1,01,000కి చేరింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.