Gold Silver Price Today | మళ్లీ పెరిగిన బంగారం, తగ్గిన వెండి!

సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,030పెరిగి రూ. 1,49,290కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950పెరిగి రూ. 1,36,850కి వద్ద నిలిచింది. వెండి ధరలు మాత్రం అనూహ్యంగా మరోసారి పతనమయ్యాయి. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 2,50,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 31, 2026, 1:09 pm IST
Read Time: 2 mins
Gold Silver Price Today | మళ్లీ పెరిగిన బంగారం, తగ్గిన వెండి!

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు ప్రభావం బంగారం, వెండి ధరలలో తీవ్ర హెచ్చు తగ్గులకు కారణమవుతున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,030పెరిగి రూ. 1,49,290కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950పెరిగి రూ. 1,36,850కి వద్ద నిలిచింది.

వెండి ధరలు మాత్రం అనూహ్యంగా మరోసారి పతనమయ్యాయి. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 2,50,000వద్ద కొనసాగుతుంది.

కొనసాగుతున్న ధరల అస్థిరత

బంగారం, వెండి ధరలపై పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధమేఘాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్నఉద్రిక్తతలతో పసిడి పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్డ్కడం లేదు. రోజురోజు ధరలలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం మళ్లీ ఉదృతమైతే బంగారం, వెండి ధరలలో మరింతగా హెచ్చు తగ్గులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ హోటళ్లలో సంక్షోభం: పాయా నుంచి బిర్యానీ దాకా.. గ్యాస్​ కొరత ప్రభావం
SIM Binding | వాట్సాప్ యూజర్లకు ఊరట.. సిమ్ బైండింగ్ గడువు పెంపు!