Gold Rate | బంగారం ప్రియం..! వన్నె తగ్గిన వెండి..! హైదరాబాద్‌లో పుత్తడి ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate | అగ్రరాజ్యం నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచబోదన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1965 డాటర్ల వద్ద కొనసాగుతున్నది. ఈ ప్రభావం భారతదేశ మార్కెట్లపై సైతం పడుతున్నది. బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరగ్గా.. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.110 పెరగ్గా.. కిలో వెండిపై రూ.500 ధర […]

Gold Rate |
అగ్రరాజ్యం నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచబోదన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1965 డాటర్ల వద్ద కొనసాగుతున్నది. ఈ ప్రభావం భారతదేశ మార్కెట్లపై సైతం పడుతున్నది.
బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరగ్గా.. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.110 పెరగ్గా.. కిలో వెండిపై రూ.500 ధర తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,200కి పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడిపై రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణంపై రూ.60,390 చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.60,050 పలుకుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారంపై రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,050 వద్ద కొనసాగుతున్నది. కేరళలో 22 క్యారెట్ల బంగారం రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,050 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,050 వద్ద కొనసాగుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,200కి తగ్గింది.