Gold Rates | భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..?
Gold Rates | బంగారం కొనుగోలుదారులు నిన్న కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. ఇవాళ మాత్రం ఆ పరిస్థితి లేదు. బంగారం ధరలు ఒక్కరోజు వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పసిడికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్(28.35 గ్రాములు) బంగారం ధర 2 వేల డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. ఇండియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. […]

Gold Rates |
బంగారం కొనుగోలుదారులు నిన్న కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. ఇవాళ మాత్రం ఆ పరిస్థితి లేదు. బంగారం ధరలు ఒక్కరోజు వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పసిడికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్(28.35 గ్రాములు) బంగారం ధర 2 వేల డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. ఇండియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 880 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగింది. బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై రూ. 700 పెరిగింది.
-హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640గా ఉంది.
-విజయవాడ, వైజాగ్ పట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640గా ఉంది.
-చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,060 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,240గా ఉంది.
-బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,690గా ఉంది.