Good News | 5,544 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఉత్వర్వులు జారీ

Good News క్రమబద్ధీకరణ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి సంతకం విధాత‌: కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ […]

Good News | 5,544 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఉత్వర్వులు జారీ

Good News

  • క్రమబద్ధీకరణ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి సంతకం

విధాత‌: కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.