Google Chrome extensions | ఈ ఎక్స్‌టెన్షన్‌ యమ డేంజర్‌ గురూ..! వాడుతున్నారా వెంటనే డిలీట్‌ చేయండి..!

Google Chrome extensions | చాలా మంద్రి బౌజర్లలో ఎక్స్‌టెన్షన్‌ను వినియోగస్తూ వస్తుంటారు. ఇవి టెక్స్‌, ఫొటోలు కాపీ చేసుకోవడంతో పాటు రకరకాల సేవలు అందుస్తుంటాయి. అయితే, వీటితో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యూజర్లకు సంబంధించిన డేటాను కొన్ని దొంగిలిస్తూ ఉంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలని టెక్‌ నిపుణులు సూచించారు. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. క్రోమ్‌ వెబ్‌స్టోర్‌లోని కొన్ని ప్రమాదకరమైన ఎక్స్ టెన్షన్స్ […]

Google Chrome extensions | ఈ ఎక్స్‌టెన్షన్‌ యమ డేంజర్‌ గురూ..! వాడుతున్నారా వెంటనే డిలీట్‌ చేయండి..!

Google Chrome extensions |

చాలా మంద్రి బౌజర్లలో ఎక్స్‌టెన్షన్‌ను వినియోగస్తూ వస్తుంటారు. ఇవి టెక్స్‌, ఫొటోలు కాపీ చేసుకోవడంతో పాటు రకరకాల సేవలు అందుస్తుంటాయి. అయితే, వీటితో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యూజర్లకు సంబంధించిన డేటాను కొన్ని దొంగిలిస్తూ ఉంటాయి.

వీటితో జాగ్రత్తగా ఉండాలని టెక్‌ నిపుణులు సూచించారు. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. క్రోమ్‌ వెబ్‌స్టోర్‌లోని కొన్ని ప్రమాదకరమైన ఎక్స్ టెన్షన్స్ గురించి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ అవస్ట్‌ (Avast) కీలక విషయాలు వెల్లడించింది.

ఇవి సిస్టమ్‌లోని యాడ్‌వేర్‌లను పంపి, సెర్చ్‌ రిజల్ట్‌ను తారుమారు చేస్తున్నాయని పేర్కొంది. అవి మన సిస్టమ్ లోకి యాడ్ వేర్ లను పంపించడం, సెర్చ్ రిజల్ట్ ను తారుమారు చేయడం చేస్తుంటాయి. క్రోమ్ వెబ్ స్టోర్‌లో ఉన్న పీడీఎఫ్ టూల్ బాక్స్ ఎక్స్ టెన్షన్ (PDF Toolbox extension) ఎంత డేంజరెస్‌ అనే విషయాన్ని ఇటీవల సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు వ్లాదిమిర్ పాలంట్ వివరించారు.

ఇలాంటి ఎక్స్ టెన్షన్స్ క్రోమ్ వెబ్‌స్టోర్‌లో సుమారు 32 వరకు ఉన్నాయని అవస్ట్‌ పేర్కొంది. అయితే, ఈ ఎక్స్‌టెన్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. వీటిలో యాడ్ బ్లాకర్స్, డౌన్ లోడర్స్, బ్రౌజర్ థీమ్స్, రికార్డర్స్, ట్యాబ్ మేనేజర్స్ తదితర ఎక్స్ టెన్షన్స్ ఉన్నాయని వెల్లడించింది.

ఇప్పటికే దాదాపు 50 ప్రమాదకర ఎక్స్ టెన్షన్స్‌ను గూగుల్‌ క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి తొలగించి. ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని ఉంటే వెంటనే తొలగించాలని టెక్‌ నిపుణులు సూచించారు. అయితే, ఎక్స్‌టెన్షన్‌లోని ప్రమాదకరమైన కోడ్‌ మనం బ్రౌజర్‌లో సెర్చ్‌ చేసే విషయాలపై నిఘా వేస్తాయి.

అందుకు సంబంధించిన యాడ్స్‌ను కుప్ప తెప్పులుగా సెర్చింజన్‌కు పంపుతుంటాయి. ఇవి సెర్చ్‌ రిజల్ట్‌ను సైతం తారు మారు చేయడం, పెయిడ్‌ యాడ్స్‌ను, స్పాన్సర్డ్‌ లింక్స్‌, డేంజరస్‌ లింక్స్‌ను పంపుతుంటాయి. చాలా వరకు గూగుల్‌ వెంటవెంటనే గుర్తించి వాటిని తొలగిస్తూ ఉంటుంది. ఎక్స్‌టెన్షన్‌ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.