Google | లోన్ యాప్స్‌పై గూగుల్ కొరడా..! ఏకంగా 3500 యాప్స్‌కు చెక్..!
Google | తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లోన్ యాప్ దందా అడ్డగోలుగా సాగుతున్నాయి. వేధింపులు తాళలేక ఇప్పటికే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనే 3500 రుణ యాప్స్‌పై గూగుల్ కొరఢా ఝుళిపించింది. ఫైనాన్షియల్ యాప్స్ విషయంలో గూగుల్ తమ విధానాలను సవరించింది. వాస్తవానికి ఫైనాన్షియల్ యాప్ నిర్వాహకులు సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకొని ఉండాలి. లేదంటే లైసెన్స్‌డ్ లెండర్లకు ఫెసిలిటేటర్లుగా వ్యవహరించాల్సి […]

Google | తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లోన్ యాప్ దందా అడ్డగోలుగా సాగుతున్నాయి. వేధింపులు తాళలేక ఇప్పటికే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనే 3500 రుణ యాప్స్‌పై గూగుల్ కొరఢా ఝుళిపించింది.
ఫైనాన్షియల్ యాప్స్ విషయంలో గూగుల్ తమ విధానాలను సవరించింది. వాస్తవానికి ఫైనాన్షియల్ యాప్ నిర్వాహకులు సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకొని ఉండాలి. లేదంటే లైసెన్స్‌డ్ లెండర్లకు ఫెసిలిటేటర్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే గూగుల్ సంబంధిత వివరాలన్నీ తప్పనిసరిగా తెలియజేలంటూ గతేడాది గూగుల్ ఆదేశించింది. గత నెలలోనే పాలసీని సైతం గూగుల్ సవరించింది. దాంతో పాటు నిబంధనలను ఉల్లంఘించాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా 1.43 మిలియన్లకుపైగా యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో చేరకుండా నిరోధించింది.
1.73లక్షల ఫ్రాడ్ డెవలపర్స్ అకౌంట్లపై బ్యాన్ విధించింది. గూగుల్ చర్యతో ప్రపంచవ్యాప్తంగా 2.3 బిలియన్ డాలర్ల లావాదేవీలను నివారించింది. గడిచిన మూడేళ్లలో 5లక్షల మేర యాప్‌లు యూజర్ల నుంచి అనవసరంగా సెన్సిటివ్ అనుమతులు పొందకుండా గూగుల్ చర్యలు చేపట్టింది.