రాళ్లు విసిరితే భవంతులు కడుతా: గవర్నర్ తమిళిసై

  • Publish Date - September 30, 2023 / 11:43 AM IST
  • దాడి చేస్తే రక్తాన్ని సిరాగా మార్చి నా చరిత్ర రాస్తా


విధాత : తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం పట్ల కృతజ్ఞతగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె మాట్లాడారు. తెలంగాణలో కొందరు నన్నూ రాజకీయ నాయకురాలినని అంటున్నారు.


అందులో రహస్యం.. దాచిపెట్టేది ఏది లేదన్నారు. గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలినన్నారు. అది నిజమే కదా అన్నారు. నేను తెలంగాణ గవర్నర్‌కు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళా మంత్రులు లేరన్నారు. తర్వాతా తాను ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణాస్వీకారం చేయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.


ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకున్నా నా పని నేను చేసుకుంటు వెలుతానన్నారు. నామీద రాళ్లు విసిరితే వాటితో భవంతులు కడుతానన్నారు. పిన్స్‌తో దాడి చేసి రక్తం చూస్తే ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర బుక్‌ రాస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైన వెనక్కి తగ్గనన్నారు.


అందరూ అందరికి నచ్చాలని లేదని, నాపై పువ్వులు వేసినా..రాళ్లు వేసిన ఆహ్వానిస్తానని మంచి పనులు చేయడాని అధికారం ఉండాలన్నారు. నా తండ్రి రాజకీయ నాయకుడైనా నేను సాధారణ రాజకీయ కార్యకర్తలగా ప్రయాణం ఆరంభించానన్నారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువన్నారు.


రాజకీయ రంగంపై మక్కువతో తాను వైద్య వృతికి దూరమయ్యాయనన్నారు. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు చాల కష్టపడాల్సివస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.