JAC | సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటాం: ఉద్యోగ సంఘాల జేఏసీ
JAC విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. దేశం ఆశ్చరపోయే విధంగా మళ్లీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ వి. మమత హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలోనే ఒకసారి 43 శాతం, మరోసారి 30 శాతం వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ఉద్యోగుల శ్రమను గుర్తించి, వివిధ శాఖలను ఉద్దేశించి, […]
JAC
విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. దేశం ఆశ్చరపోయే విధంగా మళ్లీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ వి. మమత హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలోనే ఒకసారి 43 శాతం, మరోసారి 30 శాతం వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్ దేనన్నారు.
ఉద్యోగుల శ్రమను గుర్తించి, వివిధ శాఖలను ఉద్దేశించి, పనితీరును ప్రశంసించినందుకు సీఎం కేసీఆర్‌కి కృతజ్ణతలు చెప్తున్నామని, రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతన లబ్ధి చేయడం సీఎం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని మామిళ్ల రాజేందర్, మమత కొనియాడారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram