Harry Brook: క్రికెట్ లో కొన్ని అద్భుమైన క్యాచ్‌లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయి. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ అంత ఈజీగా ఔట్ కాడు కాబట్టి ఆయనని ఔట్ చేయాలంటే అద్భుతాలు చేయాల్సిందే. బౌండరీ పోతున్న బంతులని కూడా సాహసం చేసి ఒడిసి పట్టాలి. అలాంటి ప్రయత్నాలు గతంలో చాలా మంది చేశారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్, ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అందరు నోరెళ్లపెట్టేలా చేశాడు. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఆయన క్యాచ్ పట్టి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ది హండ్రెడ్ టోర్నీలో నార్తెర్న్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యారీ బ్రూక్.. వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. అద్భుతమైన క్యాచ్‌తో ఫైర్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో(44) పెవీలియన్ బాట పట్టాడు.
బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ మొదట ఒంటి కాలితో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. కాకపోతే కాస్త సమన్వయలోపం వలన చాకచక్యంగా బంతిని గాల్లోకి వేసి తిరిగి అందుకున్నాడు. మళ్లీ బ్యాలెన్స్ కోల్పోవడంతో ఇంకోసారి బంతిని మైదానంలోకి విసిరేయగా.. పక్కనే ఉన్న ఫీల్డర్ హోస్ ఆ బాల్‌ని అందుకున్నాడు. దీంతో హ్యారీ క్యాచ్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇలాంటి క్యాచ్ ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ బ్యాట్‌తోను అద్భుతాలు సృషించాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి అదరహో అనిపించాడు. హండ్రెడ్ లీగ్ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. హ్యారీ బ్రూక్ పరుగుల వరద పారించిన కూడా నార్తెర్న్ సూపర్ చార్జర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తెర్న్ సూపర్ చార్జర్స్ నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన వెల్ష్ ఫైర్ టీమ్ 90 బంతుల్లోనే 2 వికెట్లకు 159 పరుగులు చేసి విజయదుందుభి మోగించారు.. స్టీఫెన్ ఎక్సినాజీ(58) హాఫ్ సెంచరీతో రాణించగా.. జానీ బెయిర్‌స్టో(44), జోక్లార్క్(42) విలువైన పరుగులు చేయడంతో ఆ జట్టు సునాయాసంగా గెలిచింది.
What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023