New Leopard: కొత్త రకం చిరుతను చూశారా…!?

New Leopard: కొత్త రకం చిరుతను చూశారా…!?

New Leopard: ప్రపంచంలో చిరుతలు ఆయా దేశాల బౌగోళిక వాతావరణ పరిస్థితులు..జన్యు మార్పుల నేపథ్యంలో పలు రకాల రూపాలతో జన్మిస్తూ మనుగడ సాగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో మాత్రం సాధారణ చిరుతలు, మంచు చిరుతలు, చీతాలు, నల్ల చిరుతలు(బ్లాక్ పాంథర్, బ్లాగ్ లెపార్డ్), జాగ్వార్, మబ్బుల చిరుత జాతులు కనిపిస్తాయి. ఆఫ్రికా దేశాల్లో చిరుతలు మరికొన్ని రకాలుగా ఉన్నాయి. అయితే తాజాగా భారత్ లో అరుదుగా కనిపించే నల్ల చిరుతలు తబోడా, ఒడిశా, కర్ణాటక అడవుల్లో తరుచు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ కొత్త రకం చిరుత అటవీ కెమెరాలకు చిక్కింది. నలుపు, తెలుపు కాకుండా చర్మంపై బొచ్చుతో పాటు తెల్లటి మచ్చలతో కూడిన చిరుత వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఈ చిరుత పులి రకంపై అటవీ అధికారులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడిస్తున్నారు. చిరుతలు తన సహజ వర్ణం కోల్పోయిన క్రమంలో బొచ్చు, తెల్లటి మచ్చలతో రూపాంతరం చెందుతాయని..ఇది హానికరం కాని చర్మ పరస్థితిగానే ఉంటుందని..దీంతో చిరుత ఓ కొత్త కరం రంగు రూపంతో కనిపిస్తుందని చెబుతున్నారు. మెలనిజం, విటిలిగో వంగి జన్యూపరమైన, చర్మపరమైన కారణాలతో చిరుతల రంగు మారుతుందంటున్నారు. కారణమేదైనా ఈ చిరుతను చూస్తుంటే ఇలాంటి చిరుతలు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు, వన్యప్రాణుల ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే బొచ్చు, తెల్లటి మచ్చలతో కనిపిస్తున్న ఈ కొత్త రకం చిరుత ఏ అడవిలో ఉందన్న సమాచారం వీడియోలో కనిపించకపోవడం కొంత నిరాశ పరుస్తుంది.

https://x.com/AMAZlNGNATURE/status/1926933633626976750