Warangal: ‘బలగం’ మొగిలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం.. నిమ్స్‌కు త‌ర‌లింపు

కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందిన మొగిలి ప్రభుత్వం ఆదుకోవాలని కొమరమ్మ వినతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బలగం సినిమాలో పాట పాడిన గాయకుడు పస్తం మొగిలి ఆరోగ్య పరిస్థితి మంగళవారం ఇబ్బందికరంగా మారింది. వరంగల్‌లోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలానికి చెందిన […]

Warangal: ‘బలగం’ మొగిలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం.. నిమ్స్‌కు త‌ర‌లింపు
  • కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది
  • వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందిన మొగిలి
  • ప్రభుత్వం ఆదుకోవాలని కొమరమ్మ వినతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బలగం సినిమాలో పాట పాడిన గాయకుడు పస్తం మొగిలి ఆరోగ్య పరిస్థితి మంగళవారం ఇబ్బందికరంగా మారింది. వరంగల్‌లోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలానికి చెందిన పస్తం మొగిలి, కొమరమ్మ దంపతులు సంప్రదాయ బుడగ జంగాల కళాకారులుగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల విడుదలైన బలగం సినిమాలో ‘మీ తోడు’ అనే పాట పాడి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన పాటతో కోట్లాది మంది హృదయాలను మొగిలి, కొమురమ్మ దంపతులు కదిలించారు.

అయితే కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న మొగిలి వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా మంగళవారం కిడ్నీ సమస్యకు తోడు గుండె సంబంధిత సమస్య ఎదురై పరిస్థితి విష‌మంగా మారడంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.

ఇదిలా ఉండగా తన భర్తను ప్రభుత్వం ఆదుకొని మెరుగైన వైద్యం అందించాలని మొగిలి భార్య కొమరమ్మ కోరారు. ఇటి వల మొగిలి అనారోగ్య సమస్యపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు స్పందించిన విషయం తెలిసిందే. మొగిలికి ప్రభుత్వపరంగా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొగిలిని నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.