Heavy Rains | భారీ వర్షాలకు.. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Heavy Rains బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్ బార్డెన్ (OB)లో నిలిచిన మట్టి వెలికితీత పనులు భూగర్భగనుల కన్నా, ఓపెన్ కాస్ట్ గనుల ద్వారానే అత్యధిక బొగ్గు ఉత్పత్తి విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా ఒపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 48 బొగ్గు గనులు ఉండగా అందులో 29 భూగర్భ గనులు, 19 […]

Heavy Rains | భారీ వర్షాలకు.. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Heavy Rains

  • బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్ బార్డెన్ (OB)లో నిలిచిన మట్టి వెలికితీత పనులు
  • భూగర్భగనుల కన్నా, ఓపెన్ కాస్ట్ గనుల ద్వారానే అత్యధిక బొగ్గు ఉత్పత్తి

విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా ఒపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సింగరేణి వ్యాప్తంగా 48 బొగ్గు గనులు ఉండగా అందులో 29 భూగర్భ గనులు, 19 ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్ గనులు) ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరదనీరు భారీగా చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది .

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఇందారం, మందమర్రి, కైరిగూడ డోర్లీ తదితర ఓపెన్ కాస్ట్ గనులలో దాదాపు 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. భారీ వర్షాలకు సింగరేణి ఓసిపిలో వరద నీరు చేరి కోట్లలో ఉత్పత్తి నష్టం జరిగింది.

బొగ్గు ఉత్పత్తితోపాటు మట్టి వెలికితీత పనులు (ఓవర్ బర్డెన్) దాదాపు రోజు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు కూడా స్తంభించిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనుల్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాకాలం వర్షంతో సంబంధం లేకుండా ఒక భూగర్భగనులలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి అవుతున్నప్పటికీ అత్యధిక బొగ్గు ఉత్పత్తి మాత్రం ఓపెన్ కాస్ట్ గనుల నుండి ఉత్పత్తి అవుతున్నది.

ప్రతిరోజు సింగరేణి వ్యాప్తంగా 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . ఇందులో సుమారు 80 శాతం బొగ్గును ఓపెన్ కాస్ట్ గనుల ద్వారానే ఉత్పత్తి చేస్తారు. ఎడతెరిపిలేని వర్షాల మూలంగా అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ గనులు వర్షం వరద నీటితో పనులకు ఆటంకం కలుగుతుంది.