Viral Video | మార్నింగ్ వాక‌ర్స్‌ను క‌నువిందు చేసిన జింక‌ల గుంపు

Viral Video | జింక పిల్ల‌లు ప‌రుగెడుతుంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఆ దృశ్యాల‌ను అలానే చూడాలనిపిస్తోంది. అయితే మార్నింగ్ వాక‌ర్స్‌ను ఓ జింక‌ల గుంపు క‌నువిందు చేసింది. శ‌ర వేగంతో రోడ్డు దాటుతున్న ఆ జింక‌ల‌ను చూసి వాక‌ర్స్ ఎంతో అనుభూతి పొందారు. ఈ దృశ్యం ముంబైలోని సంజ‌య్ గాంధీ నేష‌న‌ల్ పార్కులో బుధ‌వారం ఆవిష్కృత‌మైంది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఎన్ని జింక‌లు […]

Viral Video | మార్నింగ్ వాక‌ర్స్‌ను క‌నువిందు చేసిన జింక‌ల గుంపు

Viral Video | జింక పిల్ల‌లు ప‌రుగెడుతుంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఆ దృశ్యాల‌ను అలానే చూడాలనిపిస్తోంది. అయితే మార్నింగ్ వాక‌ర్స్‌ను ఓ జింక‌ల గుంపు క‌నువిందు చేసింది. శ‌ర వేగంతో రోడ్డు దాటుతున్న ఆ జింక‌ల‌ను చూసి వాక‌ర్స్ ఎంతో అనుభూతి పొందారు. ఈ దృశ్యం ముంబైలోని సంజ‌య్ గాంధీ నేష‌న‌ల్ పార్కులో బుధ‌వారం ఆవిష్కృత‌మైంది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఎన్ని జింక‌లు రోడ్డును దాటాయ‌నేది అంతు చిక్క‌డం లేదు. ఓ యూజ‌ర్ మాత్రం మొత్తం 70 జింక‌లు రోడ్డు దాటాయ‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.