Super Star Krishna | అధికారిక లాంఛనాలతో హీరో కృష్ణ అంత్యక్రియలు
Super Star Krishna| తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ ఘట్టమనేని మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. నటుడు కృష్ణ పార్థివదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణ పార్థివదేహం నానక్ రామ్‌గూడలోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకుని, కృష్ణ […]
Super Star Krishna| తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ ఘట్టమనేని మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. నటుడు కృష్ణ పార్థివదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణ పార్థివదేహం నానక్ రామ్‌గూడలోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకుని, కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు.
అనంతరం మహేశ్ బాబుతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచనున్నారు. బుధవారం ఉదయం మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram