High Court | జీవో 72ను కొట్టివేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

High Court త‌దుప‌రి విచార‌ణ నాలుగు వారాల‌కు వాయిదా హైద‌రాబాద్‌, విధాత: కొత్త మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారం కిత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్‌ 2 తర్వాత ఏర్పాటు చేసిన […]

High Court  | జీవో 72ను కొట్టివేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

High Court

  • త‌దుప‌రి విచార‌ణ నాలుగు వారాల‌కు వాయిదా

హైద‌రాబాద్‌, విధాత: కొత్త మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారం కిత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్‌ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ కానున్నాయి.

ఈ మేరకు జూలై 3న రాష్ట్ర‌ ప్ర‌భుత్వం జీవో నంబర్‌ 72ను విడుదల చేసింది. అంతకు ముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్‌ రిజర్వుడ్‌గా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు పోటీ పడే అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన పి.సాయిసిరిలోచన, పి.చంద్రశేఖర్‌ లంచ్‌మోషన్‌ రూపంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జీవో నంబర్‌ 72 చట్టవిరుద్ధమని, కొట్టివేయడంతో పాటు కౌన్సిలింగ్‌లో పాత విధానాన్నే అనుసరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్‌రిజ‌ర్వ్డ్ కోటా కింద విద్యార్థులు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు అని తెలిపింది.

తుది తీర్పుకు లోబ‌డే అడ్మిష‌న్లు ఉంటాయ‌ని ధ‌ర్మాస‌నం సూచించింది. అనంత‌రం దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది.