డీఎస్పీ ప్రణీత్‌రావు పిటిషన్ కొట్టివేత
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్సీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్‌రావు వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది

- కొనసాగుతున్న విచారణ
విధాత, హైదరాబాద్ :స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్సీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్‌రావు వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా కస్టడీ, విచారణ సాగుతుందని కోర్టుకు నివేదించారు. అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
పోలీసు స్టేషన్ లో కనీస వసతులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేశ్‌కు దర్యాప్తలో పాత్ర లేదన్నారు. పిటిషనర్‌కు తన న్యాయవాది ఫోన్‌లో తల్లిదండ్రులతో, బంధువులతో మాట్లాడే అవకాశం కల్పించారని కోర్టుకు తెలిపారు. ఏడు రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని మిగిలిందఇ మూడు రోజులేనని, ఉపయోగంలోని ఈ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదన విన్న కోర్టు ప్రణీత్‌రావు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పోలీసులు ప్రణీత్‌రావు విచారణను కొనసాగిస్తున్నారు.