బర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశాలు

కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని హై కోర్టు ఎన్నికల సంఘాన్ని, పోలీసులను ఆదేశించింది. బర్రెలక్క కు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హై కోర్ట్ ఆదేశాలిచ్చింది

  • By: Somu    latest    Nov 24, 2023 10:41 AM IST
బర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశాలు

విధాత : కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని హై కోర్టు ఎన్నికల సంఘాన్ని, పోలీసులను ఆదేశించింది. బర్రెలక్క కు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హై కోర్ట్ ఆదేశాలిచ్చింది. తనకు రక్షణ కల్పించాలని హైకోర్టులో బర్రెలక్క దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.


ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెకు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని తెలిపింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని, ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని పేర్కోంది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తామంటే కుదరదని, అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని స్పష్టం చేసింది.