High Court | పెట్రోల్ బంక్‌ల లైసెన్స్‌పై హైకోర్టు స్టే..

High Court హైద‌రాబాద్‌, విధాత: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెట్రోల్‌ బంక్‌ల లైసెన్స్‌ ఫీజు పెంపు, పాత వాటి రెన్యువల్‌ ఫీజు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వారి వద్ద నుంచి ఎలాంటి అధిక ఫీజు వసూలు చేయకూడదని చెప్పింది. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొత్త పెట్రోల్‌ బంకుల లైసెన్స్‌ ఫీజు, పాత వాటి రెన్యూవల్‌ ఫీజు […]

High Court  | పెట్రోల్ బంక్‌ల లైసెన్స్‌పై హైకోర్టు స్టే..

High Court

హైద‌రాబాద్‌, విధాత: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెట్రోల్‌ బంక్‌ల లైసెన్స్‌ ఫీజు పెంపు, పాత వాటి రెన్యువల్‌ ఫీజు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వారి వద్ద నుంచి ఎలాంటి అధిక ఫీజు వసూలు చేయకూడదని చెప్పింది. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

కొత్త పెట్రోల్‌ బంకుల లైసెన్స్‌ ఫీజు, పాత వాటి రెన్యూవల్‌ ఫీజు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది షాలినీ శ్రవంతి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.