High Court | SI, కానిస్టేబుల్ ఫలితాలు ఆపండి: హైకోర్టు
High Court పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ప్రిలిమ్స్ పూర్తి అయ్యాక జీవో నెం.57,58 తీసుకువచ్చిన బోర్డు ఆ జీవోలతో తమకు నష్టం జరిగిందని కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్, విధాత: ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేయకుండా, ఆపాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత తెలంగాణ పోలీస్ […]

High Court
- పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
- ప్రిలిమ్స్ పూర్తి అయ్యాక జీవో నెం.57,58 తీసుకువచ్చిన బోర్డు
- ఆ జీవోలతో తమకు నష్టం జరిగిందని కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
- తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసిన ధర్మాసనం
హైదరాబాద్, విధాత: ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేయకుండా, ఆపాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ( టీఎస్ఎల్ పీఆర్బీ) జీవో నెంబర్ 57, 58లను తెరమీదకు తెచ్చిందని, దాని వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌నుపై గురువారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, న్యాయమూర్తి వినోద్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు 17 వరకు నియామకాలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు విడుదల చేయ్యొందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కు ఆదేశాలు జారీ చేసింది. కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఎస్సై, కానిస్టేబుల్ నోటీఫికేషన్ విడుదల చేసిన సమయంలో బోర్డు ఎక్కడా కూడా జీవో నెంబర్ 57, 58 గురించి ప్రస్తావించలేదని పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత జీవోలు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులు కటాఫ్ మార్కులు తగ్గిస్తున్నట్లు బోర్డు ప్రకటించిందని తెలిపారు.
అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అసలు అమలే కాలేదన్నారు. దీంతో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థలందరూ నష్టపోయే అవకాశం ఉందని దయచేసి దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని పిటిషనర్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు సూచించారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 17కు వాయిదా వేసింది.